Teja Sajja: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’. యంగ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘హను-మాన్’ టీజర్ సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ‘హను-మాన్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ 36 మిలియన్ ప్లస్ వ్యూస్ క్రాస్ చేసి, పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు, యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా ‘హను-మాన్’ చిత్ర బృందాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ‘హను-మాన్’ టీజర్ అద్భుతంగా వుందని కితాబిచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
‘హను-మాన్’ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సౌండ్‌ట్రాక్స్ అందిస్తున్న ఈ సినిమాకు దాశరధి శివేంద్ర సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
