Site icon NTV Telugu

Love story: వినాయక్ క్లాప్ తో మొదలైన ‘ఒ.సి.’ మూవీ

love story

love story

కిర‌ణ్ లోవ, ల‌క్ష్మీ కిర‌ణ్‌, హ‌రీష్ బొంపల్లి, మంజీర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న చిత్రం ‘ఒ.సి.’. విష్ణు శ‌ర‌ణ్ బొంప‌ల్లి దీనికి నిర్మాత‌. కిర‌ణ్ – విష్ణు ద‌ర్శ‌కులు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం బుధవారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయ‌క్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా, మునిరాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స‌త్య మాస్ట‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ లోవ మాట్లాడుతూ, ”నేను న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి హీరోగా 18 చిత్రాలు చేశాను. ‘ఒ.సి.’ చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా డైర‌క్ష‌న్ కూడా చేస్తున్నా. విష్ణు న‌న్ను న‌మ్మి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చాడు. ఈ సినిమా కోసం ముఫ్పై క‌థ‌లు చెప్పాను. ఈ క‌థ న‌చ్చ‌డంతో సినిమా ప్రారంభించాం. టెక్నీషియ‌న్స్ అంతా అనుభ‌వంతో పాటు ఎంతో ప్ర‌తిభావంతులు. విషయం ఉన్న‌వాడు విలేజ్ లో ఉన్నా ఏదైనా సాధించ‌గ‌ల‌డు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. మరో రెండు వారాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం” అని అన్నారు.

నిర్మాత విష్ణు శ‌ర‌ణ్ బొంప‌ల్లి మాట్లాడుతూ, ”నేను నిర్మిస్తున్న తొలి చిత్రానికి వినాయ‌క్ గారు క్లాప్ కొట్ట‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో నా సోద‌ర స‌మానుడైన కిర‌ణ్ ని స్టార్ హీరోగా నిల‌బెడుతూ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఇవ్వ‌డానికి కృషి చేస్తాను. క‌థే హీరోగా ఈ సినిమా ఉంటుంది” అని చెప్పారు. ఒక మంచి టీమ్ చేస్తున్న సినిమాలో తానూ ఓ భాగం కావడం ఆనందంగా ఉందని సత్య మాస్టర్ అన్నారు. ఇప్పటి వరకూ పబ్స్ లో ప్రోగ్రామ్స్ ఇచ్చిన తాము ఈ సినిమా కోసం మంచి ట్యూన్స్ కంపోజ్ చేశామని అక్షర్ బ్యాండ్ కు చెందిన పివియ‌ల్‌య‌న్ మూర్తి, ఆరోన్‌ తెలిపారు. నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు ఈ మూవీలో ఓ చక్కని పాత్ర చేస్తున్నానని నటుడు హరీశ్‌ అన్నారు.

Exit mobile version