Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతికృష్ణ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్ టైనర్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు.. ప్రెస్ మీట్లు పెడుతూ.. సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చెప్తూ.. అంచనాలు పెంచేస్తున్నారు.
Damini: దేవుడా.. మూడు వారాలకు.. అన్ని లక్షలు తీసుకుందా.. ?
ఇక తాజాగా హీరో కిరణ్ అబ్బవరం.. ఖైరతాబాద్ గణేష్ ఆశీస్సులు అందుకున్నాడు. హైదరాబాద్ లో నే అత్యంత పేరున్న గణేశుని మండపాన్ని విజిట్ చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం బాగా జరిగిందని, ఆయన ఆశీస్సులు తనకు, చిత్రబృందాన్నికు అందాయని తెలిపాడు. తన సినిమా మంచి విజయం అందుకుంటుందని నమ్ముతున్నట్లు తెలిపాడు. కిరణ్ ను చూడగానే అభిమానులు సెల్ఫీలు అంటూ ఎగబడ్డారు. ఇక ఈ సినిమా కిరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.