NTV Telugu Site icon

Kiran Abbavaram: ర‌తికతో కిరణ్ అబ్బవరం పెళ్లి.. షాకింగ్ వీడియో రిలీజ్ !

Kiran Abbavaram Rathika Rose

Kiran Abbavaram Rathika Rose

Kiran Abbavaram Responds on Marriage Comments with Rathika: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్ ఎవరు అంటే దాదాపు అందరూ `రతిక రోజ్` పేరే చెబుతారు. ఆకట్టుకునే అందంతో హౌస్ లోకి వస్తూ వస్తూనే అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఆమె ఆ తరువాత తన బిహేవియర్ తో భారీ నెగెటివిటీని మూటగట్టుకుంది. నాలుగో వారానికే ఇంటి బాట పట్టిన ఆమె ప్రశాంత్, యావర్‌తో ప్రేమ అని చెప్పకుండా టైం పాస్ తరహాలో బిహేవ్ చేయడం వంటి వాటితో ఒక అమ్మాయి ఎలా ఉండకూడదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఎలిమినేట్ అయ్యాక కూడా ర‌తికపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఈ క్రమంలో ఆమెతో పెళ్లి గురించి కిర‌ణ్ అబ్బ‌వ‌రం షాకింగ్ కామెంట్ చేశారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మ‌రో రెండు రోజుల్లో `రూల్స్ రంజ‌న్‌`మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

Ranbir Kapoor: బ్రేకింగ్: ‘రణబీర్’కి ఈడీ సమన్లు

రత్నం కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించగా అక్టోబ‌ర్ 6న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉన్న కిరణ్ సోష‌ల్ మీడియా ద్వారా ఫాలోవ‌ర్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు చాలా ఓపిగ్గా కిర‌ణ్ స‌మాధానాలు ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒక నెటిజ‌న్ `రూల్స్ రంజ‌న్ హిట్ అయ్యాక నీకు ర‌తిక లాంటి అమ్మాయితో పెళ్లి అవ్వాల‌ని కోరుకుంటున్నా, ఆల్ ది బెస్ట్‌` అంటూ ట్వీట్‌ పెట్టగా ఆ నెటిజ‌న్ ట్వీట్ కు కిర‌ణ్ అబ్బ‌వ‌రం షాకింగ్ రిప్లై ఇచ్చాడు. `ఎందుక‌మ్మా నామీద నీకంత ప‌గ‌.. పెళ్ల‌యితే చేసుకుందాం కానీ.. చూద్దాం ఎలాంటి అమ్మాయి వ‌స్తుందో` అంటూ కిర‌ణ్ కామెంట్ చేశాడు. అలా మొత్తానికి ర‌తిక లాంటి అమ్మాయి తనకొద్ద‌ని కిర‌ణ్ ప‌రోక్షంగా చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.