Kiran Abbavaram: భారీగా రెమ్యునరేషన్ పెంచిన కిరణ్ అబ్బవరం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ అంశంతో ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ కుర్ర హీరో, ఇప్పుడు తన రెమ్యునరేషన్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినీ పరిశ్రమలో ఒక హీరో సక్సెస్ రేటును బట్టే వారి డిమాండ్ మారుతుంటుంది. కిరణ్ అబ్బవరం విషయంలో ఇది అక్షరాలా నిజమవుతోంది. ఇటీవల విడుదలైన ‘క’ (Ka), ‘కె-ర్యాంప్’ (K-Ramp) సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలను అందుకున్నాయి.
Also Read:Allu Arjun: “ఇండియన్ సినిమా షేక్.. అల్లు అర్జున్ – అట్లీ ‘మెగా మేగ్నమ్ ఓపస్’!
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ఇక సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, కిరణ్ అబ్బవరం తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక్కో ప్రాజెక్ట్‌కు సుమారు ₹12 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారనే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఒక అగ్ర నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కోసం ఆయనకు ₹12 కోట్ల భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న కిరణ్, ఈ సినిమాతో తన సక్సెస్ గ్రాఫ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!