Site icon NTV Telugu

First Look: కిరణ్ అబ్బవరం – కోడి దివ్య మూవీ టైటిల్ ఎప్పుడంటే…

kiran abbavaram

kiran abbavaram

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో అతను దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ 2లోనూ కిరణ్‌ అబ్బవరం మూవీ చేస్తున్నాడు. విశేషం ఏమంటే… కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న ఐదో చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 23న వెల్లడించబోతున్నారు. ఈ కుటుంబ కథా చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version