టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఇంటర్వ్యూలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించంన ‘ఓజీ’ చిత్రం గురించి, ప్రసంగంలో ప్రస్తావించక పోవడానికి వెనుక ఉన్న కారణాలు వివరించారు. “నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఇష్టం, గౌరవం కానీ తరచుగా ఆయన గురించి మాట్లాడితే, అది ఇతరులకు తప్పుడు సందేశం ఇవ్వొచ్చు. అంటే తన సినిమా రిలీజ్ దగ్గర ఉండడంతో పవన్ కళ్యాణ్ పేరును వాడుకుంటున్నాడేమో’, లేదా ‘ఆయన గురించి మాట్లాడితే టికెట్లు ఎక్కువ అమ్ముడవుతాయని నేను మాట్లాడాను అనుకుంటారు. నాకు ఇలాంటి అనుమానాలు రావడం ఇష్టం లేదు. నా సొంత గుర్తింపును, కష్టపడి సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read : Trivikram-and-Thaman : వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమా నుంచి థమన్ ఔట్
అంటే నేచురల్, నిజాయతీతో ప్రేక్షకుల ముందుకు రావడం కిరణ్ ఉద్దేశం. ఎవరి పేరును వాడుకుని హైప్ చేసే మార్గాన్ని అతను ఎంచుకోవాలి అనుకోవడం లేదు. ఇలాంటి సమాధానం అభిమానులను షాక్ ఇచ్చినప్పటికి, చాలామంది అభిమానులు కిరణ్ యొక్క ఈ నిజాయితీని ప్రశంసిస్తున్నారు.ఈ విధంగా, పవర్ స్టార్ సినిమాలు గౌరవిస్తూ, తన సొంత గుర్తింపును కష్టపడి సంపాదించుకునే కిరణ్ అబ్బవరం ఇతరం, యువ హీరోల్లో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
