Site icon NTV Telugu

Naga Vamsi : కింగ్డమ్ ప్లాప్.. దర్శకుడిపై విమర్శలు చేసిన నిర్మాత నాగవంశీ

Nagavamsi

Nagavamsi

సితార ఎంటటైన్మెంట్స్ నాగవంశీ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ ‘ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్ మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు గౌతమ్‌తో తమకు భిన్నాభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా సత్యదేవ్ పాత్ర చనిపోయే సన్నివేశం తర్వాత విజయ్ దేవరకొండను మరో అమ్మాయితో నిద్రిస్తున్నట్టు చూపించిన సీన్ ప్రేక్షకులకు తప్పుగా వెళ్లింది. ఆ సీన్ తీసేయమని లేదా మార్చమని మేం గౌతమ్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాం.

Also Read : TFCC : రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్

కానీ నేను వేరే కోణంలో ఆలోచిస్తున్నానని చెప్పి దర్శకుడు అంగీకరించలేదు, ఆ సీన్‌కు ప్రత్యామ్నాయంగా హీరోయిన్ విజయ్‌ కు డ్రగ్ ఇచ్చి అలా చేసిందని చూపించమని వెర్షన్‌ను కూడా సూచించము, అయినా దర్శకుడు వినలేదు. ఆడియెన్స్ ఆ సీన్ ను మరోలా అర్ధం చేసుకున్నారు ఆ ఎఫెక్ట్ సినిమాపై చూపించింది’ అని అన్నారు.   వాస్తవానికి ఈ నిర్ణయమే సినిమాపై నెగెటివ్ టాక్ రావడానికి ఒక కారణమైంది. కథకు ఆడియెన్స్ కనెక్ట్ అయిన సమయంలో ఈ సన్నివేశం ప్రేక్షకులను డిస్కనెక్ట్ చేసిందని విమర్శలు అప్పట్లో వినిపించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన కింగ్‌డమ్ తొలిరోజు నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుని అటు విజయ్ దేవరకొండకు ఇటు సితార ఎంటెర్టైఅంమెంట్స్ కు ప్లాప్ తెచ్చిపెట్టింది. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version