Kingdom : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ రిలీజ్ కు దగ్గర పడుతోంది. జులై 31న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న ఎట్టి పరిస్థితుల్లో రాబోతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్ ను ప్రకటించారు. జులై 26న తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 28న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. దీనిపై అధికారికంగా అప్డేట్ రాలేదు. కానీ దాదాపు ఇదే డేట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అలాగే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో హైప్ పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Rana : ఈడీ విచారణకు రానా డుమ్మా.. టైమ్ కోరిన హీరో..
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ ఇది. ఇప్పటి వరకు విజయ్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ లుక్, విజువల్స్, కంటెంట్ అంతా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో సత్య కూడా నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న కింగ్ డమ్ జులై 24న వస్తున్న హరిహర వీరమల్లుతో పోటీ పడాల్సి వస్తోంది. ఒకవేళ వీరమల్లు అటు ఇటు టాక్ వస్తే చెప్పలేం గానీ.. హిట్ టాక్ వస్తే మాత్రం పవన్ కు ఉన్న ఫాలోయింగ్ రీత్యా 10 రోజలు దాకా థియేటర్లలో హంగామా తగ్గదు. కాబట్టి దాన్ని తట్టుకుని నిలబడాలంటే కింగ్ డమ్ కు సూపర్ హిట్ టాక్ రావాల్సిందే.
Read Also : HHVM : వెయ్యి కేజీల పేపర్లు రెడీ చేసిన ఫ్యాన్స్.. థియేటర్లలో ఇక రచ్చే..
