Site icon NTV Telugu

Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ

Nagavamsi

Nagavamsi

Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మూవీకి వస్తున్న వారందరూ రియాక్ట్ అవుతున్నది చూస్తే చాలా రోజుల తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఈ సినిమాలో నా యాక్టింగ్ అంతా గౌతమ్ చెప్పినట్టే చేశా. ఏ సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండాలనేది గౌతమ్ పెన్ నుంచి వచ్చిందే. అందుకే మూవీ అంత బాగా వచ్చింది. ఈ మూవీ కోసం అనిరుధ్, గౌతమ్, నవీన్ చాలా కష్టపడ్డారు. వారి వల్లే ఇలా వచ్చింది అంటూ తెలిపాడు. ఇక రెండో పార్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న ప్రశ్నకు నాగవంశీ సమాధానం ఇచ్చారు.

Read Also : Karthi : స్వయంగా భోజనాలు వడ్డించిన స్టార్ హీరో

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పారు. విజయ్ చేతిలో ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ సినిమా ఉంది. దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో మూవీ ఉంది. ఆ రెండు అయిపోవడానికి ఎంత లేదన్నా రెండేళ్ల పడుతుంది. అంటే కింగ్ డమ్ పార్ట్-2 2027లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ లెక్కన సెకండ్ పార్ట్ 2028 లేదా 29లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంకో మూడు లేదా నాలుగేళ్లు ఆగాల్సిందే అన్నమాట. ఇక కింగ్ డమ్ సక్సెస్ మీట్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు మూవీ మేకర్స్.

Read Also : Sonusood : సోనూసూద్ గొప్ప మనసు.. మరో కీలక ప్రకటన..

Exit mobile version