Site icon NTV Telugu

Kingdom : కింగ్డమ్.. హిందీ రిలీజ్ కు రామ్.. రామ్

Kingdom

Kingdom

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా  జెర్సీ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్.  ఇప్ప‌టికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజ‌ర్‌ కు భారీ స్పందన వచ్చింది. షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాన కోసం అనిరుధ్ నుంచి మరో పాట రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

Also Read : Bellamkonda : మరో రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. రీమేక్ స్టార్ అని ట్రోల్స్..

కాగా కింగ్‌డ‌మ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో రిలీజ్ వాయిదా పడింది. మొత్తానికి అనేక వాయిదాల అనతరం ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెడుతుంది. మొదట ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీలోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు హింది రిలీజ్ ను ఆపేయాలని డిసైడ్ అయ్యారు. వాస్తవంగా అది మంచి నిర్ణయం కూడా. బాలీవుడ్ మోజులో అదనపు హంగులు చేర్చి, ముంబై ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టడం లేదు. గత కొన్నేళ్లుగా యంగ్ హీరోలు చాలా మంది బాలీవుడ్ లో మార్కెట్ కోసం ఆరాటపడుతున్నారు. కానీ ప్రయోజనం సూన్యం. ఇప్పుడు కింగ్డమ్ మేకర్స్ కూడా తత్త్వం భోదపడి హిందీ రిలీజ్ ను ఆపేసారు. డైరెక్ట్ గా ఓటీటీలో మాత్రమే హిందీ వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version