Site icon NTV Telugu

Kingdom : కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

Kingdom (3)

Kingdom (3)

Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. జులై 31న వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా న్యూట్రల్ గానే ఉంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో విజయ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఇలాంటి పాత్ర చేయలేదు. ఇందులోని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. కానీ ఎమోషన్ కనెక్ట్ కాలేకపోయిందనే నెగెటివిటీ వచ్చింది. అయితే ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ల గురించి ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. తాజాగా ఆ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బయట పెట్టింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.82 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. చూస్తుంటే ఈ వీకెండ్ కల్లా రూ.100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది.

Read Also : Heroine : మహేశ్ బాబు ఎత్తుకున్న ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్..

ఈ వీకెండ్ లో మూడు రోజుల సెలవులు ఉన్నాయి. వేరే సినిమా లేదు కాబట్టి కింగ్ డమ్ కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు మూవీ టీమ్ వరుస ప్రమోషన్లు చేస్తూ చాలా విషయాలను పంచుకుంటోంది. ఇది కూడా మూవీపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాయి. విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అటు డైరెక్టర్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటూ అంచనాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా.. సత్యదేవ్ విజయ్ అన్న పాత్రలో కనిపించాడు. వెంకిటేష్ విలన్ గా మెప్పించాడు. అనిరుధ్ అందించిన బీజీఎం ఆకట్టుకుంటోంది.

Read Also : Chiranjeevi : నా కోడలిని చూస్తే గర్వంగా ఉంది.. చిరు ఎమోషనల్ ట్వీట్

Exit mobile version