Site icon NTV Telugu

“భోళా శంకర్” మెగా అప్డేట్… హీరోయిన్ ఎవరంటే ?

Chiranjeevi and Meher Ramesh Movie title unveiled by Mahesh Babu

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్‌” చిత్రాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు. “భోళా శంకర్” చిత్రం అజిత్ సూపర్ హిట్ యాక్షన్ డ్రామా “వేదాళం” అధికారిక రీమేక్. ఇక మరో మెగా అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ ను కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ముందు నుంచీ అనుకుంటున్నట్టుగానే తమన్నా “భోళా శంకర్” చిత్రంలో హీరోయిన్ గా ఖరారైంది.

Read Also : బీచ్ ఒడ్డున బికినీలో మిస్ ఇండియా .. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోందిగా!!

ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ కోల్‌కతాలో జరుగుతుంది. యువ సంగీత స్వరకర్త మహతి స్వర సాగర్ “భోళా శంకర్” కోసం సౌండ్‌ట్రాక్‌లను అందించనున్నారు. అగ్ర నిర్మాత అనిల్ సుంకర క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Exit mobile version