Site icon NTV Telugu

Vikrant Rona : రేర్ ఫీట్ సాధించిన ఫస్ట్ కన్నడ హీరో సుదీప్… రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ…

Vikranth-Rona

కిచ్చా సుదీప్ నటించిన “విక్రాంత్ రోనా” 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కిచ్చా సుదీప, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ నటించిన విక్రాంత్ రోనా, జీ స్టూడియోస్ సమర్పణలో, జాక్ మంజునాథ్ తన ప్రొడక్షన్‌లో షాలిని ఆర్ట్స్‌పై, అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా నిర్మించారు. అయితే ఈ సినిమా కారణంగా సుదీప్ ఓ అరుదైన ఫీట్ సాధించిన మొట్టమొదటి కన్నడ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.

Read Also : Radhe Shyam Trailer : డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్… తప్పు ఎక్కడ జరిగిందంటే ?

“విక్రాంత్ రోనా” చిత్రం పలు భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. అయితే స్వయంగా సుదీప్ ఈ చిత్రానికి ఇంగ్లీష్ లో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ అప్డేట్ కు సంబంధించి మేకర్స్ అద్భుతమైన వీడియోను పంచుకున్నారు. అందులో సుదీప్ ఈ చిత్రానికి ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చెప్పడాన్ని చూడవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని ఈరోజు ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ తదితర అప్డేట్స్ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి.

Exit mobile version