NTV Telugu Site icon

Kiccha Sudeep : నా రెస్పాన్స్ కన్నడలో అయితే… హీరోల ట్విట్టర్ వార్

Sudeep

Sudeep

బాలీవుడ్, శాండల్ వుడ్ మధ్య భాషకు సంబంధించి ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ ఇకపై హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదని చేసిన వ్యాఖ్యలు ఈ వార్ కు తెర తీశాయి. సుదీప్ ట్వీట్ కు లైన్లోకి వచ్చిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హిందీ భాష కాదంటే, మీ సినిమాలను ప్రాంతీయ భాషలోనే కాకుండా హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అది మొదలుకొని ఇద్దరు హీరోల మధ్య సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ చర్చే నడిచింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య నడిచిన ఆ చర్చ వైరల్ అవుతోంది.

Read Also : Bahubali : ఐదేళ్ళు… చెక్కుచెదరని ‘బాహుబలి-ద కంక్లూజన్’!

అజయ్ ట్వీట్ కు స్పందించిన సుదీప్ “మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. మీరు హిందీలో పంపిన టెక్స్ట్ నాకు అర్థమైంది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాము. మరి నేను కన్నడలో టెక్స్ట్ చేసి ఉంటే పరిస్థితి ఏంటా? అని ఆలోచిస్తున్నాను. మేము కూడా భారతదేశానికి చెందినవాళ్లమే కదా సార్. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే… దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుండి ట్వీట్‌ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.

వెంటనే అజయ్ రిప్లై ఇస్తూ “హాయ్ కిచ్చ సుదీప్, మీరు నా స్నేహితుడు. అపార్థాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీని ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము. ప్రతి ఒక్కరూ మన భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము. బహుశా అనువాదంలో ఏదో మిస్టేక్ జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అపార్థాలు తొలగి, ఈ వివాదానికి తెర పడినట్టే కన్పిస్తోంది.

 

Show comments