NTV Telugu Site icon

Thalapathy68: విజయ్ కోసం రంగంలోకి ఈగ విలన్

Sudeep

Sudeep

Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్లాప్ అందుకున్నా.. లియో సినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ తమిళ్ లో లియో భారీ హిట్ నే అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి 68 చేస్తున్నాడు. ఈ సినిమానే విజయ్ నటించే చివరి చిత్రమని.. దీని తరువాత విజయ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనను అధికారికంగా మేకర్స్ సినిమాలోకి ఆహ్వానించారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక కిచ్చా సుదీప్.. తెలుగువారికి కూడా సుపరిచితుడే. రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన ఈగ సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సుదీప్. ఈ సినిమా తరువాత సుదీప్.. ఈగ సుదీప్ గా పేరు తెచ్చుకున్నాడు.అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కూడా సుదీప్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా విజయ్ కు, సుదీప్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.