Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiara Advani: ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. యశ్ సరసన నటించిన ‘టాక్సిక్’తో సౌత్ ప్రేక్షకుల్లోనూ భారీగా చర్చకు వచ్చిన ఈ హీరోయిన్, ఇప్పుడు దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఓ డిఫరెంట్ బాలీవుడ్ మూవీ సీక్వెల్లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని సంప్రదించారనే వార్త ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 2016లో విడుదలైన ‘కి అండ్ కా’ అప్పట్లో బాలీవుడ్లో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా సినిమాల్లో భర్త ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించడం, మహిళ ఇంటిని చూసుకోవడం వంటి పాత్రలను చూపిస్తుంటారు. అయితే ‘కి అండ్ కా’ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో కరీనా కపూర్ కెరీర్‌పై దృష్టి పెట్టే మహిళగా కనిపించగా, అర్జున్ కపూర్ ఇంటి బాధ్యతలను తీసుకునే పురుషుడి పాత్రలో నటించారు. ఆర్. బాల్కి దర్శకత్వంలో ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే అలరించింది.
ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే మొదటి భాగం కథను నేరుగా కొనసాగించేలా కాకుండా, అదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని పూర్తిగా కొత్త కథను రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సీక్వెల్లో కొత్త హీరో, హీరోయిన్ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. కియారాను మేకర్స్ సంప్రదించగా, ఆమె కూడా కథపై ఆసక్తి చూపినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సినిమాకు అధికారికంగా సంతకం చేయలేదు. తుది నిర్ణయం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు హీరో పాత్రకు సరిపోయే నటుడి కోసం కూడా మేకర్స్ అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
కియారా ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా ‘టాక్సిక్’లో యశ్‌తో కలిసి నటించిన తర్వాత ఆమె పేరు మరింతగా వినిపిస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల కారణంగా ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు, ట్రోలింగ్ కూడా కనిపించాయి. అయితే ఇలాంటి చర్చలు కియారా కెరీర్‌పై ప్రభావం చూపకుండా, ఆమెకు వరుసగా కొత్త అవకాశాలు వస్తుండటం గమనార్హం. అన్నీ కుదిరితే కి ‘అండ్ కా 2’ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే హీరో ఎవరనే విషయం, కియారా అద్వానీ దీనికి సంతకం చేస్తారా అనే అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే కొద్దీ మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే ‘టాక్సిక్’ తర్వాత కియారా అద్వానీకి మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత ‘కి అండ్ కా’ సీక్వెల్ రావడం ఒక ఆసక్తికరమైన అంశమైతే, ఇందులో కియారా హీరోయిన్గా నటించే అవకాశం మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. కియారా ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తే, ‘కి అండ్ కా 2’పై బాలీవుడ్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
- Tags
- cinema
- Kiara Advani
తాజావార్తలు
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!