కియారా అద్వానీకి ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి పేరు ఉన్నప్పటికీ, ‘వార్ 2’ (War 2) చిత్రం ఫెయిల్యూర్ వల్ల ఆమె కెరీర్‌కి గట్టి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, అంచనాలకు మించి ప్రమోషన్‌లతో విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతం వరకు బాగానే కలెక్షన్స్ సాధించిన, తర్వాత భారీగా పడిపోయింది. దీంతో నిర్మాతలకు పెద్ద నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ ఫ్లాప్ కావడంతో, అభిమానుల్లోనూ ఉహించని నిరాశ నెలకొంది. అయితే.. కియారా అద్వానీతో వైఆర్ఎఫ్ మూడు సినిమాల డీల్ చేసుకున్నప్పటికీ తాజా పరిస్థితుల్లో..
Also Read : Ajay Devgn : డబ్బు కోసం బాధ్యత మరిచిపోయారా? అజయ్ దేవగన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఆ కాంట్రాక్ట్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ‘వార్ 2’లో కియారా తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, బలహీనమైన కథ, అర్ధం లేని స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. మొదటి సారి బికినీ లుక్‌లో కనిపించినా, అది వర్కౌంట్ కాలేదు. ఇక ఇటీవల తల్లి అయిన కియారా ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్‌లో ఉన్నారు. ఈ కారణంగా కూడా ఆమె కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంత వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇక వైఆర్ఎఫ్ సంస్థ స్పై యూనివర్స్‌లో కొత్త హీరోయిన్‌లను తీసుకురావాలని భావిస్తోందని, కియారాను రీప్లేస్ చేసే చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘వార్ 2’ ఫెయిల్యూర్ బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల దిశను మార్చే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ప్రేక్షకులు ఇప్పుడు గ్లామర్‌కంటే కంటెంట్, ఎమోషన్, కొత్తదనం ఉన్న కథలను కోరుకుంటున్నారని నిర్మాతలు విశ్లేషిస్తున్నారు.
