Site icon NTV Telugu

రేసీగా సాగిన ‘ఖిలాడి’ క్యాచ్ మీ సాంగ్!

khiladi

khiladi

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. శనివారం ఐదో పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ‘క్యాచ్ మీ’ అంటూ సాగే ఈ పాటను ర‌వితేజ – డింపుల్ హయాతిపై చిత్రీక‌రించారు. ఈ పాటలో డింపుల్ లుక్స్‌, కిల్ల‌ర్ ప‌ర్స‌నాలిటి, క‌ట్టిప‌డేసే ఎక్స్‌ప్రెష‌న్స్ ప్రేక్ష‌కులను థ్రిల్ కు గురిచేస్తున్నాయి.

దేవిశ్రీ ఇచ్చిన రేసీ ట్యూన్ కు తగ్గట్టుగా శ్రీమణి రచన చేయగా, దీనిని నేహా బాషిన్, జ‌స్ప్రీత్ జాస్జ్ గానం చేశారు. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించారు. ఈ క్లబ్ సాంగ్ మూవీలో మాస్ కు స్పెషల్ కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు కెమెరామెన్‌లుగా వ్యవహరించిన ‘ఖిలాడి’కి శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ సంభాషణలు అందిస్తున్నారు.

Exit mobile version