Site icon NTV Telugu

KGF2: బాలీవుడ్‌లో మరో అరుదైన మైలురాయి

Kgf2 Rare Milestone In Bollywood

Kgf2 Rare Milestone In Bollywood

విడుదలైనప్పటి నుంచి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, అంచనాలకి తగ్గట్టు ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ముఖ్యంగా.. బాలీవుడ్‌లో అయితే రికార్డుల తాట తీస్తోంది. తొలిరోజు రూ. 53.95 కోట్లు (నెట్) కలెక్ట్ చేసి, బాలీవుడ్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు.. నాలుగో రోజు రూ. 50.35 కోట్లు కొల్లగొట్టి, నాల్గవ రోజు ఆ స్థాయి వసూళ్ళు కలెక్ట్ చేసిన తొలి భారతీయ సినిమాగా సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా బాలీవుడ్ గడ్డపై మరో మైలురాయిని అందుకుంది. ఆల్రెడీ ‘దంగల్’ సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్ల రికార్డ్‌ని బద్దలు కొట్టిన ఈ చిత్రం.. లేటెస్ట్‌గా రూ. 430 కోట్ల మార్క్‌ని దాటేసింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ. 430.95 కోట్లు (నెట్) కలెక్ట్ చేసిందట! దీంతో.. బాహుబలి: ద కన్‌క్లూజన్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ రెండో స్థానంలో నిలిచింది. ‘బాహుబలి 2’ రూ. 511 కోట్ల (నెట్)తో అగ్రస్థానంలో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. రవీనా టండన్, సంజయ్ దత్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్స్ విధానంలో స్ట్రీమ్ అవుతోన్న ఈ చిత్రం.. ప్రీమియం సబ్‌స్ర్కైబర్స్ కోసం త్వరలోనే ఉచితంగా అందుబాటులోకి రానుంది.

Exit mobile version