విడుదలైనప్పటి నుంచి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, అంచనాలకి తగ్గట్టు ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ముఖ్యంగా.. బాలీవుడ్‌లో అయితే రికార్డుల తాట తీస్తోంది. తొలిరోజు రూ. 53.95 కోట్లు (నెట్) కలెక్ట్ చేసి, బాలీవుడ్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు.. నాలుగో రోజు రూ. 50.35 కోట్లు కొల్లగొట్టి, నాల్గవ రోజు…