KGF2: ఓటీటీలోకి వచ్చేసింది.. కానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఐదు వారాలు పూర్తి కాకముందే, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే, ఇక్కడో ఫిట్టింగ్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే, రూ. 200 కట్టాల్సి ఉంటుంది. రెంటల్స్ విధానంలో ఈ చిత్రాన్ని అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా.. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సినిమాలు చూసేందుకు వీలుంటుంది. అయితే.. ఎర్లీ యాక్సెస్‌లో భాగంగా ముందుగానే స్ట్రీమ్ చేస్తుండడంతో, రెంటల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకా ఈ సినిమాని థియేటర్లలో చూడని వాళ్ళు.. రూ. 200 గాను రెంట్‌కి తీసుకొని, ఇంట్లోనే సౌకర్యవంతంగా వీక్షించొచ్చు.
కాగా.. గత నెల 14వ తేదీన భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం, కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి కన్నడ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ని సైతం వెనక్కు నెట్టేసి, దంగల్, బాహుబలి2ల తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీనిద్ధి శెట్టి కథానాయికగా నటించింది. ‘కేజీఎఫ్: చాప్టర్1’ కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్లో.. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టండన్లతో పాటు రావు రమేశ్, ప్రకాజ్ రాజ్‌లు కీలక పాత్రల్లో నటించారు.
Also Read
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
thrill ×2 | craziness ×2 | K.G.F ×2 💥#EarlyAccessOnPrime, rent now pic.twitter.com/FDtYdtro0l
— prime video IN (@PrimeVideoIN) May 16, 2022
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!