సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శహకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక దీని కొనసాగింపుగా వస్తున్న కెజిఎఫ్ 2 పై ప్రేక్షకులు భారీ అంచాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
” ఈ సినిమా కోసం మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంగతి మాకు తెలుసు. కానీ కెజిఎఫ్ చాప్టర్ 2 యొక్క సంగ్రహావలోకనం పొందడానికి మా ప్రియమైన అభిమానుల ఆత్రుతను చూడటానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు ముందుగా ఏమి చూడాలనుకుంటున్నారు? KGF సైన్యం తదుపరి కదలికను నిర్ణయించనివ్వండి. సాంగ్ లేదా ట్రైలర్ లేదా ఇంకేదైనా సర్ ప్రైజ్ ని కోరుకుంటున్నారా..?” అంటూ ప్రేక్షకులకే ఆప్షన్స్ ఇచ్చారు. ఇక దీంతో అభిమానులు తమకేం కావాలో తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 14 నే ఈ సినిమా థియేటర్లో రానుంది.