Site icon NTV Telugu

KGF 2 Trailer: ‘కెజిఎఫ్’ లో గరుడను చంపిన తరువాత ఏం జరిగింది..?

kgf 2

kgf 2

వచ్చేసింది.. వచ్చేసింది.. యావత్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా కేఈజిఎఫ్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. కెజిఎఫ్ చాప్టర్ 1 తో ఎన్నో సంచలనాలకు తెరలేపాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక చాప్టర్ 2 తో మరి ఇంకెన్నో అంచనాలను రేకెత్తించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డులను బద్దలుకొట్టాయి. ఇక ఎట్టకేలకు అభిమానులందరూ ఎదురుచూస్తున్న ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది.

కెజిఎఫ్ లో గరుడను చంపిన తరువాత ఏం జరిగింది..? అంటూ జర్నలిస్ట్ ప్రశ్నతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రక్తంతో రాసిన కథ ఇది.. రక్తాన్ని కావాలంటుంది అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్ తో సినిమా మొత్తాన్ని ఒక లైన్ లో చెప్పేశాడు ప్రశాంత్ నీల్.. గరుడ చనిపోయాక ఆ కెజిఎఫ్ గనులను సొంతం చేసుకోవడానికి అధీరా (సంజయ్ దత్) పోరాటం ఒక పక్క. ఇంకోపక్క తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి రైమా సేన్ (రవీనా టాండన్) రాజకీయ ఎత్తులు మరోపక్క ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక వీరికి అడ్డుగా.. ప్రజలకు అండగా రాఖీ బాయ్(యష్) నిలబడడం గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. కెజిఎఫ్ లో చూపించిన విధంగానే రాఖీ బాయ్ ఒకరికి తలవంచకుండా ఆ కెజిఎఫ్ ని ఎవరి చేతికి పోనివ్వకుండా ఎలా కాపాడాడు, చివరికి ఒక చరిత్రను సృష్టించిన రాఖీభాయ్ ఏమయ్యాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా మొత్తానికి యష్ నటన హైలెట్ గా నిలవనుంది అని చెప్పొచ్చు. రాఖీ బాయ్ కి ధీటుగా అధీరాగా సంజయ్ దత్ లుక్, నటన ప్రేక్షకులను సీట్లల్లో కుర్చోనివ్వదని తెలుస్తోంది. ఇక రావు రమేష్, ఈశ్వరి రావు, శ్రీనిధి శెట్టి పాత్రలు కీలకంగా కనిపించనున్నాయి. చివర్లో అమ్మ డైలాగ్ ని చూపించి ఈ చాప్టర్ లో కూడా తల్లి సెంటిమెంట్ ఉండనున్నట్లు డైరెక్టర్ హింట్ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్ పవర్ ఫ్యాక్డ్ గా కట్ చేశారు. వైలెన్స్ రాఖీ భాయ్ ని వెత్తుకుంటూ వచ్చింది అనే డైలాగ్ తో అతని క్యారెక్టర్ ని చూపించేశారు. మరి ఈ సుల్తాన్ ఏప్రిల్ 14 న ఎన్ని రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి.

Exit mobile version