KGF 2 Trailer: ‘కెజిఎఫ్’ లో గరుడను చంపిన తరువాత ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చేసింది.. వచ్చేసింది.. యావత్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా కేఈజిఎఫ్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. కెజిఎఫ్ చాప్టర్ 1 తో ఎన్నో సంచలనాలకు తెరలేపాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక చాప్టర్ 2 తో మరి ఇంకెన్నో అంచనాలను రేకెత్తించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డులను బద్దలుకొట్టాయి. ఇక ఎట్టకేలకు అభిమానులందరూ ఎదురుచూస్తున్న ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది.
కెజిఎఫ్ లో గరుడను చంపిన తరువాత ఏం జరిగింది..? అంటూ జర్నలిస్ట్ ప్రశ్నతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రక్తంతో రాసిన కథ ఇది.. రక్తాన్ని కావాలంటుంది అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్ తో సినిమా మొత్తాన్ని ఒక లైన్ లో చెప్పేశాడు ప్రశాంత్ నీల్.. గరుడ చనిపోయాక ఆ కెజిఎఫ్ గనులను సొంతం చేసుకోవడానికి అధీరా (సంజయ్ దత్) పోరాటం ఒక పక్క. ఇంకోపక్క తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి రైమా సేన్ (రవీనా టాండన్) రాజకీయ ఎత్తులు మరోపక్క ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక వీరికి అడ్డుగా.. ప్రజలకు అండగా రాఖీ బాయ్(యష్) నిలబడడం గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. కెజిఎఫ్ లో చూపించిన విధంగానే రాఖీ బాయ్ ఒకరికి తలవంచకుండా ఆ కెజిఎఫ్ ని ఎవరి చేతికి పోనివ్వకుండా ఎలా కాపాడాడు, చివరికి ఒక చరిత్రను సృష్టించిన రాఖీభాయ్ ఏమయ్యాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా మొత్తానికి యష్ నటన హైలెట్ గా నిలవనుంది అని చెప్పొచ్చు. రాఖీ బాయ్ కి ధీటుగా అధీరాగా సంజయ్ దత్ లుక్, నటన ప్రేక్షకులను సీట్లల్లో కుర్చోనివ్వదని తెలుస్తోంది. ఇక రావు రమేష్, ఈశ్వరి రావు, శ్రీనిధి శెట్టి పాత్రలు కీలకంగా కనిపించనున్నాయి. చివర్లో అమ్మ డైలాగ్ ని చూపించి ఈ చాప్టర్ లో కూడా తల్లి సెంటిమెంట్ ఉండనున్నట్లు డైరెక్టర్ హింట్ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్ పవర్ ఫ్యాక్డ్ గా కట్ చేశారు. వైలెన్స్ రాఖీ భాయ్ ని వెత్తుకుంటూ వచ్చింది అనే డైలాగ్ తో అతని క్యారెక్టర్ ని చూపించేశారు. మరి ఈ సుల్తాన్ ఏప్రిల్ 14 న ఎన్ని రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి.
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!