సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
కెజిఎఫ్ లోని స్త్రీ శక్తిని పోస్టర్ లో చూపించారు. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. ఇక ఈ పోస్టర్ ని బట్టి ఈశ్వరి రావు కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నటి మాళవిక అవినాష్ జర్నలిస్ట్ గా కనిపిస్తుంది.. ఇక యష్ తల్లిపాత్రలో అర్చన జోయిస్ నటిస్తుంది. ఇక ఈ స్త్రీ శక్తిని అంతా ఒకేదగ్గర చేర్చి.. మహిళలకు కెజిఎఫ్ ట్రిబ్యూట్ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.