Site icon NTV Telugu

Ketika Sharma: అందాల ముద్దుగుమ్మ హ్యాట్రిక్ కొట్టేసిందిగా!

Kreti Sharma

Kreti Sharma

 

కేతిక శర్మ హ్యాట్రిక్ కొట్టేసింది… ఇది సక్సెస్ విషయంలో అయితే ఆమె, ఆమె ఫ్యాన్స్ సంతోష పడేవాళ్ళు, కానీ పరాజయాల విషయంలో వరుసగా మూడో ఫ్లాప్ ను అమ్మడు అందిపుచ్చుకుంది. దర్శక నిర్మాత పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాశ్ హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’తో ఈ న్యూఢిల్లీ బొద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే అడ్డూఅదుపూ లేకుండా అందాలు ఆరబోసింది. అయితే ‘రొమాంటిక్’ విషాదాంత ప్రేమకథ కావడంతో కేతిక శర్మను చూసి యువత ఉసూరుమంది. కానీ గ్లామర్ డాల్ గా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇక రెండో సినిమా ‘లక్ష్య’లో మాత్రం కేతిక శర్మకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. హీరో నాగశౌర్య మీద పెట్టిన ఫోకస్ హీరోయిన్ పాత్ర మీద దర్శకుడు పెట్టలేదు. దాంతో ఆ సినిమా నటిగానూ కేతికా శర్మకు పేరు తెచ్చిపెట్టలేదు.

 

అదే సమయంలో కేతిక శర్మ ముచ్చటగా మూడో సినిమాగా ‘రంగరంగ వైభవంగా’కు సైన్ చేసింది. ఇందులో కథానాయిక పాత్రకు మంచి స్కోపే ఉంది. దాంతో అవకాశం ఉన్న చోటల్లా కేతికా శర్మ చక్కని నటన ప్రదర్శించింది. అయితే… అందాల ఆరబోతకు మాత్రం ఈ సినిమాలో ఛాన్స్ దక్కలేదు. బట్… పంజా వైష్ణవ్ తేజ్ కంటే… కేతికా శర్మే బాగా చేసిందనే పేరైతే వచ్చింది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో తెలుగులో వరుసగా పరాజయాల విషయంలో కేతిక హ్యాట్రిక్ కొట్టినట్టు అయ్యింది. కానీ ఈ ఫ్లాప్స్ తో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పుడుతుందని నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కేతికా శర్మకు తెలుగులో కొన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయట. ఒక్క హిట్… ఒకే ఒక్క హిట్ అమ్మడి ఖాతాలో పడితే… తిరిగి కెరీర్ ఊపందుకోవడం ఖాయం!

Exit mobile version