Site icon NTV Telugu

Kethika Sharma : వారిద్దరే నా ఫేవరెట్ హీరోయిన్లు..

Kethika

Kethika

Kethika Sharma : హాట్ బ్యూటీ కేతిక శర్మ మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటోంది. మొన్నటి దాకా పెద్దగా ఛాన్సులు లేక ఇబ్బందులు పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ఛాన్సులు అందుకుంటోంది. మొన్ననే రాబిన్ హుడ్ లో అదిదా సర్ ప్రైజ్ అనే ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. దాని తర్వాత మళ్లీ సింగిల్ మూవీలో నటిస్తోంది. శ్రీ విష్ణు హీరోగా వస్తున్న ఈ మూవీలో కేతిక హీరోయిన్. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆమె అనేక విషయాలను పంచుకుంది. అదిదా సర్ ప్రైజ్ వివాదంపై కూడా స్పందించింది ఈ భామ. ఆ విషయంలో డైరెక్టర్ చెప్పినట్టే చేశానని.. తనకేం తెలియదని చెప్పింది.
Read Also : Off The Record: ఊరు మారినా? తీరు మారలేదా?

‘నేను ఏది చేసినా డైరెక్టర్లు చెప్పినట్టే వింటాను. వారు చెప్పిందే చేస్తాను. అది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ. సింగిల్ సినిమాతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించాలనే కల తీరిపోయింది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేయాలన్నదే నా డ్రీమ్. సాయిపల్లవి, కీర్తి సురేష్ నా ఫేవరెట్ హీరోయిన్లు. వారిద్దరి నటన అంటే నాకు చాలా ఇష్టం. వారిలాగా నటనకు స్కోప్ ఉండే పాత్రల్లో నటించాలని ఎంతగానో ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Read Also : LIC Jeevan Shanti: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం ఒక లక్ష పెన్షన్..!

Exit mobile version