Site icon NTV Telugu

Kerala High Court: “జానకి” ఉంటే తప్పేంటి.. అనుపమ పరమేశ్వరన్ సినిమాపై వివాదం..

Janaki Vs State Of Kerala

Janaki Vs State Of Kerala

Kerala High Court: కేంద్రమంత్రి, మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ నటించిన మళయాల సినిమా ‘‘JSK – జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’’లో ‘‘జానకి’’ పేరు ఉపయోగించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ పేరు ఉపయోగించడం ద్వారా మతపరమైన సెంటిమెంట్లు దెబ్బతింటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేరళ హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.

సర్టిఫికేట్ ఆలస్యంపై చిత్ర నిర్మాణ సంస్థ కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎన్ నాగరేష్, భారతీయ సినిమా వివాదం లేకుండా పౌరాణిక పేర్లను ఉపయోగించిన చరిత్ర ఉందని చెప్పారు.” ‘‘సీతా ఔర్ గీత’’ సినిమా ఉంది, జానకీ అంటే సీత, ఈ సినిమాతో ఏ సమస్య రాలేదు, ఎవరికీ ఎలాంటి ఫిర్యాదు లేదు. ఇలాగే రామ్ లఖన్ సినిమా ఉంది. ఎవరీకి ఎలాంటి సమస్య లేదు. అలాంటప్పుడు జానకికి మాత్రం ఎందుకు ఫిర్యాదు వచ్చింది..?” అని న్యాయమూర్తి CBFC తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (DSGI)ని ప్రశ్నించారు.

Read Also: Zohran Mamdani: మోడీ, నెతన్యాహూ ఒకటే.. గుజరాత్ ముస్లింల గురించి మమ్దానీ అడ్డగోలు అబద్ధాలు..

CBFC చిత్రనిర్మాతలకు షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది, సినిమా టైటిల్, డైలాగ్‌ల నుండి ‘జానకి’ పేరును తొలగించాలని వారిని ఆదేశించింది. సీతాదేవితో సంబంధం ఉన్న ‘జానకి’ అనే పేరును అటువంటి కంటెంట్ ఉన్న సినిమాలో ఉపయోగించడం సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952లోని సెక్షన్ 5B(2) కింద మార్గదర్శకం 2 (xi)ని ఉల్లంఘించవచ్చని CBFC వాదించింది. ఇది జాతి, మతాలను ధిక్కరించే సీన్లను, పదాలను నిషేధిస్తుంది.

లైంగిక హింస ప్రధానాంశంగా వచ్చే ఈ సినిమా జూన్ 27న విడుదల కావాల్స ఉంది, కానీ సర్టిఫికేషన్ ఆలస్యంలో వాయిదా పడింది. అయితే, బోర్డు అభ్యంతరం వెనక ఉన్న హేతుబద్ధతను కోర్టు ప్రశ్నించింది. CBFC యొక్క స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే సినిమాను క్లియర్ చేసిందని, కానీ చైర్మన్ దానిని రివైజింగ్ కమిటీకి సూచించారని, అది పేరు సంబంధిత సమస్యను లేవనెత్తిందని పేర్కొంది. జూన్ 30న కోర్టు ముందు షోకాజ్ నోటీసును ఉంచాలని ఆదేశిస్తూ, చిత్రనిర్మాతలు నోటీసుకు ప్రతిస్పందించడానికి లేదా అప్పీల్ దాఖలు చేయడానికి స్వేచ్ఛగా ఉన్నారని న్యాయమూర్తి తెలిపారు.

జూన్ 12న చిత్రాన్ని సర్టిఫికేషన్ కోసం సమర్పించామని, జూన్ 18న ప్రదర్శనను పూర్తి చేశామని నిర్మాణ సంస్థ తెలిపింది. పేరుపై అకస్మాత్తుగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, ఈ ఆలస్యం ఆర్థిక నష్టాలకు కారణమవుతోందని, ఆర్టికల్ 19(1)(a) (వాక్ స్వేచ్ఛ), 19(1)(g) (ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు) కింద వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని వారు పేర్కొన్నారు.

Exit mobile version