Kerala High Court: కేంద్రమంత్రి, మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ నటించిన మళయాల సినిమా ‘‘JSK - జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’’లో ‘‘జానకి’’ పేరు ఉపయోగించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ పేరు ఉపయోగించడం ద్వారా మతపరమైన సెంటిమెంట్లు దెబ్బతింటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేరళ హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.