జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా అవతార్ (Avatar) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్'(Avatar: the way of water). ప్రపంచ సినీ అభిమానులని ఒక కొత్త లోకంలోకి తీసుకోని వెళ్లడానికి ‘అవతార్ 2’ డిసెంబర్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఒకే ఒక్క సినిమా ‘అవతార్ 2’ అంటే ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేయాలంటేనే 1600 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంది. ఇండియాలో కూడా ‘అవతార్ 2’కి భారి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ని కాష్ చేసుకోవడానికి థియేట్రికల్ రైట్స్ ని ఎక్కువ ధరకి అమ్ముతున్నారు.
ప్రొడ్యూసర్స్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) తెలుగు, తమిళ్ థియేట్రీకల్ రైట్స్ ని రూ.100కోట్లకు కోట్ చేశారు. ఇంత ధర పెట్టి కొనడానికి ఏ నిర్మాత/డిస్ట్రిబ్యూటర్ ముందుకి రాలేదు. ఇదే ‘అవతార్ 2’టీంకి షాక్ అనుకుంటే, తాజాగా కేరళలో ‘అవతార్ 2’ కు ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) నియమాల ప్రకారం, అక్కడ ఒక సినిమా కలెక్షన్స్ నుంచి 50% న్ని డిస్ట్రిబ్యూటర్స్ కి షేర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. అవతార్ 2 సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి FEUOK 55% న్ని షేర్ ఇవ్వడానికి థియేటర్ ఓనర్స్ అంగీకరించారు. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 60శాతానికి తగ్గేది లేదని తెగేసి చెప్పడంతో… ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(FEUOK) ‘అవతార్ 2’ ను బ్యాన్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం FEUOK ఆధీనంలో దాదాపుగా 400థియేటర్స్ ఉన్నాయి. ఈ సినిమా హాల్స్ ఇప్పుడు ‘అవతార్ 2’ని స్క్రీన్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తేనే ‘అవతార్ 2’ కేరళ రిలీజ్ అవుతుంది. ఈ చర్చలు ఫలించకపోతే అవతార్ 2 సినిమాని థియేటర్స్ చూడడానికి రెడీ అవుతున్న కేరళ సినీ అభిమానులందరికీ నిరాశ తప్పదు. రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఈ సమస్యని పరిష్కరిస్తారేమో చూడాలి.
