కరోనా బారిన పడ్డ ‘మహానటి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రపరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలను అనుభవిస్తున్నాను. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండు వ్యాక్సిన్లు వేయించుకుని, జాగ్రత్తగా ఉన్నా కూడా నేను కరోనా బారిన పడ్డాను. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో వారందరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటె వ్యాక్సిన్ వలన తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు.. మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చు.. త్వరగా కోలుకొని మళ్లీ యాక్షన్లోకి దిగుతాను” అంటూ చెప్పుకొచ్చింది. ‘మహానటి’ చిత్రంతో అందరికి చేరువైన కీర్తి ప్రస్తుతం మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది.
Also Read
— Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?