Site icon NTV Telugu

Keerthy Suresh: మహానటి పెళ్లి.. సోషల్ మీడియాను షేక్ చేస్తుందే..?

Keerthy

Keerthy

Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అంటే నిజమే అని అంటున్నారు తమిళ్ తంబీలు. గత కొన్నిరోజులుగా కీర్తి పెళ్లి వార్త నెట్టింట సంచలనాన్ని సృష్టిస్తోంది. మొన్నటి నుంచి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కీర్తి ఎఫైర్ నడుపుతోందని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకొంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కీర్తి, విజయ్ ఫోటోలను పక్కపక్కన పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీతకు న్యాయం కావాలంటూ జస్టిస్ ఫర్ సంగీత అనే గ్యాస్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క కీర్తి సురేష్.. ఒక వ్యాపారవేత్తను వివాహమాడుతోందని మరికొందరు చెప్పుకురావడం విశేషం.

Read also:
Pune Crime News: దారుణం.. ఏడుగురిని బలి తీసుకున్న ‘ప్రతీకారం’
ఆమె ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతనికి కేరళలో రిసార్ట్స్ కూడా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఈ జంట ప్రేమాయణం 13 ఏళ్ళ కిందటి నుంచి నడుస్తోందని టాక్. చిన్ననాటి స్నేహితులు అయిన వీరు ఈ మధ్యనే ఇరు కుటుంబాలకు తమ ప్రేమను వెల్లడించారని, వారు కూడా అంగీకరించడంతో త్వరలోనే కీర్తి వివాహం జరగనుందని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలతో బిజీగా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి అంటూ వెళ్లిపోతుందా..? అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే కీర్తి నోరు విప్పాల్సిందే.

Exit mobile version