Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం నడుపుతున్నదని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కీర్తి, ఆమె తండ్రి కొట్టిపారేశారు. తన కూతురుకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని, ఆమె పెళ్లి కుదిరితే తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఇక దీంతో కీర్తి పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక తాజాగా కీర్తి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. రెడ్ కలర్ డ్రెస్ లో కీర్తి నవ్వుతూ ఉండగా.. ఆమె వెనుక ఒక వ్యక్తి.. ఆమెను ఎంతో చనువుగా పట్టుకొని సిగ్గులు ఒలకబోస్తున్నాడు. ఇక కీర్తి సైతం అతడి భుజాన చేతులు వేసి మరి నవ్వులు చిందిస్తుంది. ఈ ఫొటోకు క్యాప్షన్ గా.. టాలీవుడ్ సినిమా సెట్ లో కీర్తి.. మెకానిక్ తో ప్రేమాయణం నడుపుతుందని రాసుకొచ్చారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Satya Prem Ki Katha: కార్తీక్, కియారా ‘సత్యప్రేమ్ కి కథ’కు ‘పసూరి’ హైలైట్
సెట్ లో అందరితో క్లోజ్ గా ఉంటే ఇలా ఎఫైర్స్ అంటకడతారా అంటూ ఏకిపారేస్తున్నారు. అసలు కీర్తి అంతలా క్లోజ్ గా ఉన్న ఆ వ్యక్తి ఎవరు..? అతన్ని చూస్తుంటే సినిమా ఫీల్డ్ కు సంబంధించిన వాడిలా కనిపించడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆమెకు తెలిసిన వ్యక్తిలానే కనిపిస్తున్నాడు. అంత చనువుగా ఆమె భుజంపై వాలి అతను నవ్వడం ఏంటి..? ఫ్రెండా..? అభిమానినా..? లేక ఆమె దగ్గర పనిచేసే వ్యక్తా..? ఎవరు అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.ఇకపోతే కీర్తి తెలుగులో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.
