NTV Telugu Site icon

Keerthy Suresh: బోల్డ్ సిరీస్ లో కీర్తి సురేష్ ..

February 7 (20)

February 7 (20)

మార్పు సహజమే అని పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం కెరీర్ పరంగా మారుతు వస్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్ లల్లో వచ్చిన మార్పు చూడటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రజంట్ కీర్తి సురేష్ విషయంలో అలాగే ఉంది. మొన్నటి వరకు క్యూట్ రోల్స్ మాత్రమే చేసిన ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో కేవలం ఆ తరహా రోల్స్ మాత్రమే చేసింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి పెర్ఫార్మెన్స్ రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ చాలా మారిపోయింది. స్కిన్ షో చేస్తు రెచ్చిపోతుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చినప్పటికి కొంత నిరాశే మిగిలింది. ఇక తాజాగా ఈ అమ్మడు ఇప్పటి వరకు నటించని పవర్ ఫుల్ పాత్రతో రాబోతుంది.

Also read:Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ టీజర్ రిలీజ్.. మొత్తానికి వెంకీ మామా బలే స్కెచ్ వేశాడుగా

ఊహించని విధంగా కీర్తి సురేష్  ‘అక్క’ అనే సిరీస్‌లో కన్పించనుంది. ఈ వెబ్ సిరిస్‌కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సీరిస్ లో  ఆమె టైటిల్ రోల్ పోషించింది. ఇదేదో ఆషామాషీ కంటెంట్ తో వస్తున్న రెగ్యులర్ హిందీ సినిమా కాదట దీని కోసం బోలెడు కసరత్తు చేసి తీస్తున్నారట. కాగా దర్శకుడు ధర్మ రాజ్ శెట్టి  తెరకెక్కిస్తున్నా ఈ సిరీస్, పేర్నూరు అనే ఫిక్షనల్ ప్లేస్ కు చెందిన లేడీ డాన్ గా ఈ ‘అక్క’ సిరీస్ రాబోతుంది.నెరేషన్ వినగానే ఆదిత్య చోప్రా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బేబీ జాన్ కన్నా ముందే, కీర్తి సురేష్ సైన్ చేసింది. అలాగే ఇందులో రాధిక ఆప్టే కూడా ముఖ్యపాత్ర పోషించింది.ఇక టీజర్‌లో చూపించింది కేవలం శాంపిల్స్ మాత్రమేనంటా కంటెంట్ చాలా షాకింగ్ ఉంటుందని టాక్.  ‘అక్క’ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది అనే క్లారిటీ లేదు కానీ.. ఈ సిరీస్ సంచలనం సృష్టించడం అయితే ఖాయం తెలుస్తోంది.