Site icon NTV Telugu

Kayadu Lohar : ఆ వార్తలు చూసి ఏడ్చేశా.. కయాదు లోహర్ కామెంట్స్

Kayadu Lohar

Kayadu Lohar

Kayadu Lohar : క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె కొంత కాలంగా సినిమాల్లో బిజీగా ఉంటుంది. అస్సాం నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పైగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. అయితే తాజాగా తమిళనాడులో మద్యం రిటైలర్‌ ‘టాస్మాక్‌’ కుంభకోణంలో కయాదు లోహద్ పేరు మార్మోగిపోతోంది. ఆమె ఇందులో భాగస్వామ్యం అయిందని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Read Also : I Bomma Ravi : డబ్బు సంపాదించట్లేదని భార్య, అత్త హేళన.. పైరసీ వైపు రవి

దీంతో ఈ వార్తలపై హీరోయిన్ కయాదు లోహర్‌ స్పందించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. తనపై ఇలాంటి వార్తలు చూసి బాధపడ్డానని చెప్పింది. టాస్మాక్‌ కుంభకోణంలో భాగమైన వారు ఇచ్చిన ఓ పార్టీకి కయాదు లోహర్‌ వెళ్లిందని.. దీనికోసం ఆమె రూ.35 లక్షలు తీసుకున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడం అంతా అబద్దమే అని ఆమె తెలిపింది. ఇలాంటి వార్తలు చూసి తాను బాధపడ్డానని తెలిపింది. తన కలల కోసం ఎంతో కష్టపడుతుంటే.. ఇలా తనమీద లేనిపోని నిందలు వేయడం ఏంటని మండిపడింది ఈ బ్యూటీ.

Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

Exit mobile version