Site icon NTV Telugu

The Paradise : ప్యారడైజ్ లో నాని సరసన యూత్ ఫేవరెట్ హీరోయిన్..?

Paradise

Paradise

The Paradise : నేచురల్ స్టార్ నాని హిట్-3తో మంచి హిట్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ మాస్ యాంగిల్ మూవీ చేసి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీని తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ది ప్యారడైజ్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ చివరకు ఓ అందాల భామను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు శ్రీనిధి శెట్టి పేరు బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె పేరు ఫైనల్ కాలేదు.

Read Also : HIT 3: నాని రాంపేజ్.. ఆరు రోజుల్లో ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్
అలాగే కీర్తి సురేష్, సాయిపల్లవి, శ్రీలీల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. వారెవరూ కాకుండా చివరకు కాయదు లోహర్ పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ చివరకు ఓ అందాల భామను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు కాయదు లోహర్. రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ మూవీతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కసారిగా సౌత్ లో ఆమె పేరు మార్మోగిపోతోంది. ఆమె అందాలకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి కొత్త హీరోయిన్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆమెను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది.
Read Also :Bhagavanth Kesari: మళ్ళీ భగవంత్ కేసరి కాంబో?

Exit mobile version