Site icon NTV Telugu

Kavin: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ‘దాదా’ హీరో

Kavin

Kavin

Kavin: కోలీవుడ్ కుర్ర హీరో కెవిన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మోనిక డేవిడ్‌ మెడలో మూడు ముళ్లు వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు. కెవిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనా కానమ్‌ కలలాంగల్‌ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక హీరోగా మారాడు. నాట్పున్న ఎన్ననాను తెరియుమా అనే సినిమాతో హీరోగా మారిన అతను గతేడాది వచ్చిన దాదా సినిమాతో స్టార్ గా మారాడు. ఈ సినిమా ఓటిటీ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. భార్య వదిలేసినా భర్తగా.. తల్లి లేని కొడుకుకు అన్ని తానే అయ్యి పెంచిన దాదాగా కెవిన్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ హిట్ ను అందుకుంది.

King Nag: మన్మథుడు వస్తున్నాడు… టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుగా

దాదా తరువాత కెవిన్ ను తెలుగువారు దాదా హీరో అనే పిలుస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ హిట్ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న కెవిన్ నేడు పెళ్లి పీటలు ఎక్కాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మోనిక డేవిడ్‌ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ కుర్ర హీరో ఈ మధ్యనే ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఇక నేడు అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్ళికి కోలీవుడ్ సెలబ్రీటీలు తరలివచ్చారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version