Tiger 3: ‘లేకే ప్రభు కా నామ్..’ పాటలో 7 అద్భుతమైన లుక్స్‌తో మెస్మరైజ్ చేయనున్న కత్రినా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి తరం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే హీరోయిన్స్‌లో అద్భుతమైన అందం, అభినయం కత్రినా కైఫ్ సొంతం. బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’లో ఆమె జోయా అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు..కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ‘లేకే ప్రభు కా నామ్..’ పాట ఓ ఉదాహరణగా నిలవనుంది. ఈ పాట రిలీజ్ తర్వాత ఇంటర్నెట్ నెక్ట్స్ రేంజ్లో వైరల్ అవుతుంది.
‘టైగర్ 3’ చిత్రంలో ‘లేకే ప్రభు కా నామ్..’ పాటలో కత్రినా కైఫ్ ఏకంగా ఒకట్రెండు కాదు.. 7 అద్భుతమైన లుక్స్‌తో అలరించబోతున్నారు. ఆమె ఎంటైర్ కెరీర్లో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరేట్ సాంగ్ లేకే ప్రభు కా నామ్. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ ‘‘‘లేకే ప్రభు కా నామ్’ విజువల్‌గా ప్రేక్షకులను అలా కట్టిపడేస్తుంది. అందుకనే నా ఫేవరేట్ సాంగ్స్‌లో ఇదొకటి. టర్కీలోని కాప్పడోసియా ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు. మాషాల్లా, స్వాగ్ సే స్వాగత్ పాటల తర్వాత నా ఫేవరేట్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్‌తో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాటలో నన్ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ పాటలో నన్ను ఆమె ఏకంగా ఏడు మెస్మరైజింగ్ లుక్స్‌లో చూపించారు. దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. టైగర్ ఫ్రాంచైజీ నుంచి వచ్చే పాట ఎప్పుడూ చార్ట్ బస్టర్‌గా నిలుస్తుంది. అదే కోవలో లేకే ప్రభు కా నామ్ పాటను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. వైభవి పాటను చిత్రీకరించిన తీరు.. టైగర్, జోయా మధ్య ఉండే కెమిస్ట్రీ సరికొత్తగా అలరించనుంది. సల్మాన్ ఖాన్‌గారితో కలిసి డాన్స్ చేయటాన్ని ఎ్పుడు ఎంజాయ్ చేస్తాను. లేకే ప్రభు కా నామ్ పాట చిత్రీకరణలో మరచిపోలేని అనుభూతులెన్నో ఉన్నాయి’’ అన్నారు.
Also Read
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
శుక్రవారం లేకే ప్రభు కా నామ్ పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. క్షణాల్లోనే అది నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఫుట్ ట్యాపింగ్ డాన్స్ ట్రాక్ .. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు అలా కళ్లు అప్పగించి చూసేలా చేయనుంది. ఈ పాటను ప్రీతమ్ కంపోజ్ చేయగా బెన్నీ దయాల్, అనుషా మణి పాడారు. ఈ పార్టీ సాంగ్ ఈ సీజన్లో అందరికీ ఫేవరేట్ సాంగ్‌గా నిలవనుంది.
వెండితెరపై ప్రేక్షకులను మెప్పించే జోడీల్లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఎప్పుడూ ముందుంటుంది. వారిద్దరి కాంబినేషన్లో హిస్టారిక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాగే తిరుగులేని చార్ట్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆదిత్య చోప్రా టైగర్ 3లో టైగర్ , జోయా పాత్రల్లో మెప్పించటానికి సిద్ధమయ్యారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన టైగర్ 3 చిత్రాన్ని మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!