Site icon NTV Telugu

Merry Christmas : స్టార్ట్ చేసిన కత్రినా, విజయ్ సేతుపతి

katrina

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ “మెర్రీ క్రిస్మస్‌”. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా డిసెంబర్ 2021లో ఈ సినిమాను ప్రారంభించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించారు. సమాచారం ప్రకారం స్టార్స్ ఇద్దరూ ఈ సినిమా కోసం 45 రోజులు కేటాయించారు. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మిస్తాన్ స్టూడియోస్‌లో థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలోని నటీనటులు, సిబ్బంది హోలీ కోసం కాస్త విరామం తీసుకోగా, మళ్లీ ఈరోజు షూటింగ్ ప్రారంభించనున్నారు.

Read Also : RRR : ప్రీమియర్ షోలకు వ్యతిరేకత !?

ఈ అద్భుతమైన థ్రిల్లర్ క్రిస్మస్ ఈవ్‌లో జరిగే ఒక సంఘటన గురించి తెలుపుతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఒక ఇంటి సెట్‌ను నిర్మించారు. విజయ్, కత్రినా పాత్రలు గ్రే షేడ్స్ లో ఉంటాయట. ఏప్రిల్‌లో సినిమా రెండవ షెడ్యూల్‌ను పూర్తి చేస్తామని, ఆ తర్వాత చివరి దశను మే, జూన్‌లో చిత్రీకరిస్తామని, సినిమా మొత్తం ముంబైలో, సెట్స్‌లో అలాగే లైవ్ లొకేషన్‌లలో చిత్రీకరణ జరుపుకుంటుందని నిర్మాత రమేష్ తౌరానీ చెప్పుకొచ్చారు. కత్రినా, విజయ్ జంటను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version