ఐదేళ్ల డేటింగ్ అనంతరం రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని కపూర్ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కొత్త జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి అనంతరం ఫోటోలను పంచుకుంటూ అలియా చేసిన పోస్ట్ పై సోనమ్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, మాధురీ దీక్షిత్, రితీష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్‌లు వ్యాఖ్యానించారు. కానీ అందరి దృష్టి వీళ్ళ కామెంట్స్ పై కాకుండా రణబీర్ కపూర్ మాజీ లవర్స్ పెళ్లిపై ఎలా స్పందించారు ? అనే దానిపైనే ఉంది.
Read Also : Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల సీన్ !
గతంలో రణబీర్ తో డేటింగ్ చేసిన కత్రినా, దీపికా ఇద్దరూ రణబీర్, అలియా కలకాలం కలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీపికా పదుకొణె “మీ ఇద్దరి జీవితంలో ప్రేమ, కాంతి, నవ్వు ఉండాలని కోరుకుంటున్నాను” అని విష్ చేయగా, కత్రినా “మీ ఇద్దరికీ అభినందనలు… లవ్ అండ్ హ్యాపీనెస్” అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేశారు. ఇక రణవీర్ సింగ్ ను దీపికా పదుకొణె వివాహం చేసుకోగా, బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తో కత్రినా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అలియా-రణబీర్ కు కృతజ్ఞతలు తెలిపింది.