Site icon NTV Telugu

ఏప్రిల్‌లో థియేటర్లలో సమంత సినిమా..

samantha

samantha

సమంత నటించిన సినిమా ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతితో, నయనతారతో కలసి సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో టీజర్‌ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలియచేశాడు. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ తో పాటు మూవీ విడుదల తేదీ ప్రకటిస్తూ ‘2.2.2022న 2.22కి రిపోర్టింగ్. 11.2.2022 న టీజర్. ఏప్రిల్‌లో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం’ అని చెప్పాడు విఘ్నేశ్.

ఇక విఘ్నేశ్ పోస్ట్ చేసిన పోస్టర్‌లో విజయ్ సేతుపతి, నయన్ ఒకరి కళ్లలో ఒకరు చూస్తుండగా… సమంత వారిద్దరినీ చూస్తున్నట్లుంది. విశేషం ఏమంటే ఈ ముగ్గురూ తెల్లటి దుస్తులు ధరించి పసుపు రంగు క్లాత్ ను కప్పుకున ఉన్నారు. 2020లో వచ్చిన ‘జాను’ సినిమా తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న సమంత చిత్రమిది. అయితే ఇటీవల సమంత ‘పుష్ప: ది రైజ్‌’లో ప్రత్యేక పాటతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది.

‘కాతు వాకుల్ రెండు కాదల్’ సినిమాను విఘ్నేష్ శివన్ తన రౌడీ పిక్చర్స్‌ పతాకంపై సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలసి నిర్మించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాలో సమంత ఖతీజాగా, నయనతార కన్మణి పాత్రలో కనిపించనుండగా, విజయ్ సేతుపతి రాంబో పాత్రలో మెరవనున్నాడు.

Exit mobile version