Kashmira Shah: బాలీవుడ్ నటి కాశ్మీర షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ 4 లాంటి షోలలో మెరిసి ఫేమస్ అయ్యింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన కాశ్మీర.. 2003లో బ్రాడ్ లిట్టర్‌మాన్‌ను పెళ్లాడింది. అయితే నాలుగేళ్లు కూడా తిరగముందే విబేధాల వలన ఈ జంట విడిపోయారు. ఇక 2013 లో ఆమె టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లో ఈ జంటకు మంచి గుర్తింపు ఉంది. అయితే పెళ్లి అయిన చాలా ఏళ్ళ వరకు వీరికి పిల్లలు లేరు. పిల్లల కోసం ఈ జంట ఎన్నో ప్రయత్నాలు చేసారు. కానీ, ఏది వర్క్ అవుట్ కాలేదు. దీంతో కాశ్మీర చాలా కుంగిపోయిందట. కానీ, చివరికి ఒక స్టార్ హీరో వలన తనకు సంతాన భాగ్యం కలిగిందని ఆమె చెప్పుకురావడం విశేషం. అవును.. ఆ స్టార్ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్. ఆయన చెప్పిన సలహా పాటించడం వలనే తాము ఇద్దరు బిడ్డలకు తల్లి అయినట్లు చెప్పుకొచ్చింది.
Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఇప్పట్లో లేనట్టే?
“నేను, కృష్ణ ఎన్నో ఏళ్ళు పిల్లల కోసం పోరాటం. 14 సార్లు నేను నా భర్తతో ప్రెగ్నెంట్ కావడానికి ప్రయత్నించా.. ఎన్నో హాస్పిటల్స్ తిరిగా.. చివరికి ఐవిఎఫ్ ద్వారా కూడా ప్రయత్నించాను. అయినాకూడా కాలేదు. అలా మేము నిరుత్సాహం లో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ ఒక సలహా ఇచ్చాడు. మీరెందుకు సరోగసీ ట్రై చేయకూడదు అని, దీంతో ఆ సలహా బావుంది కదా అని ట్రై చేసాం. ఇప్పుడు సరోగసీ వలన ఇద్దరు పిల్లలకు తల్లిగా మారాను. సల్మాన్ వలనే నేను తల్లిని అయ్యాను.. అందుకు ఆయనకు ఎప్పుడు ఋణపడి ఉంటాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.