ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఐదారు సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న ‘కార్తికేయ -2’ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు నిర్మాతలు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న క్రేజీ ప్రొడక్షన్ హౌసెస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్, చందు మొండేటి కాంబో వచ్చిన ‘కార్తికేయ’ చక్కని విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్ మీద కూడా సామాన్య ప్రేక్షకులలో, పరిశ్రమ వర్గాలలో ఆసక్తి నెలకొంది.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ బర్త్ డే ను పురస్కరించుకుని సోమవారం ‘కార్తికేయ -2’ ను జూలై 22న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, ద్వాపర యుగాలకు ఈ చిత్రంతో సంబంధం ఉందని తాజాగా విడుదల చేసిన పోస్టర్ బట్టి అర్థమౌతోంది. మరి డాక్టర్ కార్తికేయ శ్రీ కృష్ణుడి చరిత్రకు సంబంధించిన ఏ అంశాలను వెలుగులోకి తెస్తాడో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
