Sardar Teaser: కార్తీ నట విశ్వరూపం.. ఖైదీ కి మించి ‘సర్దార్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sardar Teaser: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా స్టార్ డైరెక్టర్ పి. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో కార్తీ సరసన రాశీ ఖన్నా, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలో కార్తీ నట విశ్వరూపం చూపించినట్లు టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. “ఇండియన్ మిలటరీ కాన్ఫిడెన్షియల్ రూమ్ ఎంటర్ అయ్యాడు.. ఇండియన్ మిలటరీ రహస్యాలన్నీ అందులోనే ఉన్నాయి ఆ రహస్యాలు బయటికి వచ్చాయి అంటే.. మొత్తం అయిపోయినట్టే” అన్న డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. ఆ రూమ్ లో లైలా దేనికోసం వెతుకుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ వచ్చిన వ్యక్తి ఎవరు..? ఏంటి అని ఇండియన్ మిలటరీ ట్రేస్ చేసే పనిలో పడుతోంది.
ఇక ఆ ఇన్వస్టిగేషన్ లోనే ఆరుగురు వ్యక్తులను వారు అనుమానిస్తారు. అయితే ఆరుగురు వ్యక్తులు ఆరుగురు కాదని, ఒక్కడే అన్న విషయం తెలుస్తోంది. అతడే స్పై.. అతడి కోడ్ నేమ్ సర్దార్. అతడిని పట్టుకోవడం కోసం ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు సర్దారు మోటివ్ ఏంటి..? ఎందుకు ఇండియన్ మిలటరీ రూమ్ లోకి వెళ్ళాడు..?. అసలు సర్దారు అసలు పేరు ఏంటి..? దేనికోసం అతడు పోరాడుతున్నాడు..? అనేది సస్పెన్స్ గా చూపించారు. టీజర్లో ఆరు డిఫరెంట్ పాత్రలో కార్తీ కనిపించాడు. ఇక చివర్లో ఒక్కసారి స్పై అయితే చివరి వరకు స్పై గానే ఉంటాడు అనే డైలాగ్ ఆకట్టుకొంది. జివి ప్రకాష్ నేపధ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. కార్తీ ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించేశాడు. మొత్తానికి టీజర్ టోన్ సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఖైదీ ని మించి హిట్ అవుతుందో లేదో చూడాలి.
Also Read
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!