Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజిత్ హీరోగా ఇప్పటికే అధిక్ రవిచంద్రన్ అనే దర్శకుడితో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా అజిత్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత డేర్ డెవిల్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఆ సినిమా కూడా ఈ నెల రెండో తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. తర్వాత చెన్నైలో కూడా ఈ సినిమా షూట్ చేసే అవకాశం ఉంది. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే, ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒక క్యామియోలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఆయన సీఎం పాత్రలోనే కనిపిస్తారా లేక మరేదైనా పాత్రలో కనిపిస్తారా అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, ఉన్ని ముకుందన్, పార్థివన్, ప్రభు, సునీల్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి శాలిని అజిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే సీఎం అతిథి పాత్ర అనే వార్త ప్రస్తుతానికైతే గాసిప్ కాగా అది నిజమవుతుందా లేక కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందా అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు లేదా సీఎం తో షూట్ చేసే వరకు ఆగక తప్పని పరిస్థితి.
Also Read
- Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
- IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
- Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!
- Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!