ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ప్రేక్షకులను 100 శాతం థియెటర్ లకు రప్పించాలంటే చాలా కష్టంగా మారింది. ప్రమోషన్స్ తప్ప మరో దిక్కులేదు. అందుకే మూవీ విషయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకుంటున్నారోమ ప్రమోషన్స్ కూడా అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఒక్కటి కూడా వదలకుండా అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, కొంతమంది నటీమణులు ప్రమోషన్ విషయంలో వెనుకంజ వేయడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. చాలా మంది నిర్మాతలు ఇప్పటికే బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు కొత్త తరహా “వార్నింగ్” ఇచ్చారు.
Also Read : Keerthy Suresh: ఆ రోల్స్ కోసమే బాలీవుడ్‌కి వచ్చాను..
కరణ్ జోహార్ మాట్లాడుతూ, “సినిమాకు సైన్ చేసిన తర్వాత కేవలం పారితోషికం తీసుకోవడం సరిపోదు. రిలీజ్ వరకు జరిగే ప్రమోషన్లలోనూ నాయికలు బాధ్యతగా పాల్గొనాలి. కొంతమంది నటీమణులు ‘మనం నటించాం, పారితోషికం తీసుకున్నాం, కానీ ప్రమోషన్ కోసం అదనపు ప్యాకేజ్ ఉండాలి’ అని భావిస్తారు. ఇది పూర్తిగా తప్పు. నిజమైన ప్రొఫెషనలిజం మాత్రం తమ ఫిల్మ్‌ని విజయవంతం చేయడానికి ప్రతి ప్రయత్నంలో భాగస్వామ్యం కావడమే” అన్నారు. అలాగే అతను దీపికా పదుకొణే, అలియా భట్, కరీనా కపూర్‌లను ఉదాహరణగా సూచించారు. “ఈ ముగ్గురు హీరోయిన్లు, తమ షోకు సంబంధం లేకపోయినప్పటికీ, గర్భిణీ స్థితిలో ఉన్నప్పటికీ, సినిమా ప్రమోషన్స్ కోసం ముందుకొచ్చారు. వారిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ విధంగా నిర్మాతల కోసం సహకారం చూపించడం, మూవీ విజయానికి ముఖ్యమైన అంశం” అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.