NTV Telugu Site icon

Kapil Sharma: అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు

Kapil Sharma Depression

Kapil Sharma Depression

Kapil Sharma Talks About His Career Bad Days: ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ కమెడియన్లలో కపిల్ శర్మ ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన అతడు.. అనతికాలంలోనే ఎవరికీ అందనంత స్థానానికి ఎదిగాడు. తమ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్స్ అందరూ ఇతని షోకి క్యూ కడుతున్నారంటే, అతని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కపిల్ శర్మ.. ఒకప్పుడు గడ్డు పరిస్థితుల్ని కూడా ఎదుర్కున్నాడు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అతని కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. అప్పుడు ఒంటరితనాన్ని అనుభవించిన కపిల్.. ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడట! ఈ సంచలన విషయాన్ని తన జ్విగాటో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Same Gender Marriage: స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడం కుదరదు.. తేల్చిచెప్పిన కేంద్రం

కపిల్ శర్మ మాట్లాడుతూ.. ‘‘2017లో నేను చేసిన ఫిరంగి సినిమా సరిగ్గా ఆడలేదు. అదే సమయంలో నా స్నేహితుడు సునీల్ గ్రోవర్‌తోనూ గొడవ అవ్వడంతో అతడు దూరమయ్యాడు. అప్పుడు నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఒక సెలెబ్రిటీగా నేను కోట్లమందికి తెలుసు. కానీ, ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. కనీసం బీచ్ వద్ద కూర్చొని, సముద్రాన్ని చూస్తూ సాధారణ జీవితం గడిపే పరిస్థితి కూడా లేదు. రెండు గదుల ఫ్లాట్‌లోనే ఉంటూ, బయట చీకటిని చూస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో వివరించలేను. ఆ టైంలో నేను ఆత్మహత్య గురించి ఆలోచించాను. నా కష్టసుఖాలను పంచుకునే వారు ఎవరూ లేరని అనుకున్నాను. ఈ దశను నేను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. చిన్నతనంలో కూడా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ.. ఎవరూ పట్టించుకోలేదు’’ అని చెప్పాడు.

Amit shah flight: అమిత్ షా వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైద్రాబాద్‌లోనే..

డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలేసి వచ్చినప్పుడు.. మనకు జాగ్రత్తలు చెప్పడానికి, పరిస్థితుల గురించి వివరించడానికి ఎవరూ ఉండరని కపిల్ తెలిపాడు. ఆ టైంలో ఒంటరిగా అయిపోయినట్టు ఉంటుందని.. అలాంటి దశను దాటిన తర్వాతే మీ చుట్టూ జరుగుతన్న విషయాలను గమనించడం ప్రారంభిస్తారని అన్నాడు. ఒక కళాకారుడు సెన్సిటివ్‌గా ఉన్నాడంటే.. దానర్థం అతడు తెలివి తక్కువవాడు కాదని వివరించాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాకే.. బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని తనకు అర్థమైందని కపిల్ చెప్పుకొచ్చాడు.