Site icon NTV Telugu

Kantara 2 : జూనియర్ ఆర్టిస్ట్ మృతితో మాకు సంబంధం లేదు.. కాంతార-2 టీమ్..

Kantara 2

Kantara 2

Kantara 2 : కొన్ని రోజులుగా కాంతార-2 నిత్యం సోషల్ మీడియాలో హైలెట్ గా ఉంటోంది. ఈ మూవీ విషయంలో కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. మొన్న షూటింగ్ చేస్తుండగా ఎం.ఎఫ్‌. కపిల్‌ అనే జూనియర్‌ ఆర్టిస్ట్‌ మృతి చెందాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో మూవీ చుట్టూ చిక్కులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. జూనియర్ ఆర్టిస్టు కపిల్ మృతితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. కపిల్ షూటింగ్ టైమ్ లో చనిపోలేదని.. అతను చనిపోయిన రోజులు అసలు షూటింగ్ లేదని తెలిపింది.

Read Also : Chiranjeevi: నేను కూలిపోయా.. వెంటనే విజయ హాస్పిటల్లో చేర్చారు!
కాంతార-2 షూటింగ్ అయిపోయిన తర్వాత అతను ఈత కొట్టేందుకు మంగళవారం సాయంత్రం ఓ నది వద్దకు వెళ్లాడని.. అనుకోకుండా నీటిలో మునిగి చనిపోయినట్టు తెలిపింది. అతని మృతిపై తప్పుడు కథనాలను నమ్మొద్దని.. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి అంటూ కోరింది. రిషబ్ శెట్టి హీరోగా, ఆయనే డైరెక్ట్ చేస్తున్న కాంతార-2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో.. రెండో పార్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. 2 అక్టోబర్ 2025న మూవీ రిలీజ్ కాబోతోంది.
Read Also : Raghavendra Rao: మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్.. పని అయిపోయిందనుకున్నారు

Exit mobile version