Rishab Shetty: కాంతార సినిమాతో అన్ని ఇండుస్త్రీలకు సుపరిచితుడు గా మారిపోయాడు హీరో రిషబ్ శెట్టి. కథను రాసుకొని, దాని డైరెక్ట్ చేస్తూ నటించడమంటే మాములు విషయం కాదు అందులో రిషబ్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా విజయం అందుకోవడంతో ఆయనకు అన్ని ఇండస్ట్రీల నుంచి అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. మా బ్యానర్ లో చేయమంటే మా బ్యానర్ లో చేయమని నిర్మాతలు రిషబ్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని వేరే ఏ హీరో అయినా చేజార్చుకోడు.. కానీ రిషబ్ మాత్రం అందుకు నిరాకరించాడట.. ఎందుకంటే తనకు ప్రాంతీయాభిమానం ఎక్కువట.. కన్నడ సినిమాలు తప్ప మిగతా ఏ సినిమాలు చేయనని చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ ” ఇటీవల నన్ను చాలామంది వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నారా..? అని అడుగుతున్నారు. కానీ నేనెప్పుడూ కన్నడలోనే సినిమాలు తీస్తాను.. ఆ సినిమాల్లోనే నటిస్తాను.. ఆ సినిమాలను వేరే భాషల్లో అనువదిస్తాను. అలా మా కన్నడ ఇండస్ట్రీ ఎదుగుదలకు నా వంతు కృషి నేను చేస్తాను.” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కాంతార హీరో అనుకున్నది నెరవేరుతుందా..? లేదా..? అనేది కాలమే నిర్ణయించాలి.